close
Choose your channels

చిరు చిత్రంలో నిహారిక‌

Wednesday, April 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు చిత్రంలో నిహారిక‌

ఇప్ప‌టి వ‌ర‌కు మెగా ఫ్యామిలీ నుండి ఎక్కువ మంది హీరోలే ప‌రిచ‌యం అయ్యారు. అయితే `ఒక మ‌న‌సు` చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచయ‌మైంది. ఆ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో నిహారికాకు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ రాలేదు. త‌మిళంలో ఓ సినిమాలో న‌టించింది. తెలుగులో సుమంత్ అశ్విన్‌తో క‌లిసి `హ్యాపీ వెడ్డింగ్‌`లో న‌టిస్తుంది.

ఈ సినిమా ఈ వేస‌వికి విడుద‌ల కానుంది. అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఇప్పుడు నిహారిక మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న`సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌లు న‌టిస్తున్నారు. మ‌రి నిహారిక చేస్తోన్న పాత్ర ఎలా ఉండ‌బోతుందో మరి!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.