close
Choose your channels

కశ్మీర్ విషయంలో పాక్‌కు ఐరాస షాక్!

Friday, August 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లు ఇప్పటికే ఉభయ సభల్లో కూడా పాస్ అయ్యింది. అయితే ఈ రద్దును మాత్రం ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ముఖ్యంగా ఈ నిర్ణయంతో దాయాది, ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. ఓ వైపు భారత్.. మరోవైపు చైనా.. తాజాగా ఐక్య రాజ్యసమితి ఇలా వరుస షాకులతో పాక్ దిక్కుతోచని స్థితిలో పడింది.

ఏ మాత్రం మొహమాటం లేకుండా!

కశ్మీర్‌ వ్యవహారాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి భారత్‌ను తప్పుబట్టాలని పాక్‌ ఎంతో ఆశపడింది. అయితే అనుకున్నట్లు జరగపోవడంతో బొక్కాబోర్లా పడిపోయింది. కశ్మీర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వ్యవహరించాలని ఐక్యరాజ్యసమితిని పాక్ కోరింది. ఈ అభ్యర్థనను ఏ మాత్రం మొహమాటం లేకుండా నిర్ద్వంద్వంగా ఐరాస తోసిపుచ్చింది. కశ్మీర్‌ ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని తేల్చిచెప్పింది. ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుటేరస్‌.. అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

మధ్యవర్తిత్వం అక్కర్లేదు!

భారత్‌-పాక్ మధ్య 1972 నాటి సిమ్లా ఒప్పందాన్ని గుర్తు చేసిన ఆయన.. కశ్మీర్‌ అంశం భారత్‌, పాక్ మధ్య ద్వైపాక్షిక సమస్య అని.. దాన్ని శాంతియుతమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఇందులో మూడో పక్షం మధ్యవర్తిత్వం అక్కర్లేదన్నారు. అయితే జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను సెక్రటరీ జనరల్‌ గుటెరస్ సమీక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ అంశంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని గుటెరెస్ చెప్పారని అని స్టీఫెన్‌ మీడియాకు వెల్లడించారు.

మొత్తానికి చూస్తే.. కశ్మీర్‌పై పాకిస్థాన్‌ చేసిన ప్రకటనలు.. భారత్‌ను దోషిగా ప్రపంచానికి చూపించాలన్న ఏ ఒక్క ప్రయత్నం సక్సెస్ కాకపోగా.. ఐకాస మొదలుకుని ఒకప్పటి పాక్ మిత్రదేశాలే తప్పుబట్టి ఉమ్మేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.. మున్ముందు మరెన్ని దేశాలు పాక్‌కు మొట్టికాయలేస్తాయో వేచిచూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.